కూరగాయలు తాజాగా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అందుకే చాలా మంది ఒకేసారి ఎక్కువ రోజులకి కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులు తాజాగా ఉంటాయి. అందుకే అందుకే ఒకటేసారి ఎక్కువ పరిమాణంలో కూరగాయల్ని తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. ఇది మనకి సౌలభ్యంగానే ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయో చెబుతున్నారు నిపుణులు. ఇది అంతగా మంచిది కాదు అని.. గది ఉష్ణోగ్రతలోనే కోడిగుడ్లు, టమోటాలను నిల్వ చేయాలని చెబుతున్నారు.
అన్ని కూరగాయలను పెట్టినట్లే ఫ్రిజ్‌లో టమోటాలు, గుడ్లు పెడుతుంటాం. దీని వల్ల అవి నిల్వ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ, ఇది ఎంతవరకూ నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. టమోటాలు, గుడ్లు పెట్టడం వల్ల అవి పాడైపోతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవును కొన్ని రోజులుగా ఇదే విషయమై పరిశోధనలు చేసిన నిపుణులు తాజా విషయాన్ని వెల్లడించారు. కాబట్టి వీటిని వీలైనంత వరకూ ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.