టిల్లు క్యూబ్ కథ రివీల్ చేసేసిన సిద్ధూ..

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చేసింది. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించి సిద్ధూకి మంచి కెరీర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చి మొదటి పార్ట్ కంటే కూడా భారీ విజయం సాధిస్తుంది. ఇప్పటికే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

టిల్లు క్యారెక్టర్ ఈసారి కూడా బాగా పేలింది. దీంతో మూవీ యూనిట్ టిల్లు క్యూబ్ కూడా తీస్తామని అధికారికంగానే ప్రకటించారు. తాజాగా సిద్ధూ ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర పాయింట్ ని చెప్పాడు. డీజే టిల్లులో అమ్మాయి మోసం చేసే పాయింట్ ఉంది. టిల్లు స్క్వేర్ అదే పాయింట్ తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది ఉంది. ఈ సారి టిల్లు క్యూబ్ లో టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉండబోతుంది. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతాను అని తెలిపారు. ఇటీవల సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇప్పట్నుంచే మూవీ పై అంచనాలు నెలకొన్నాయి.