‘సీతారామం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రష్మిక, తరుణ్‌ భాస్కర్‌, సుమంత్‌, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్‌, కథ, స్క్రీన్‌ ప్లే, మ్యూజిక్‌ సహా హీరో, హీరోయిన్ల నటన కూడా బాగా కుదిరాయి. దాంతో ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.