బాలీవుడ్‌లో ‘సీతారామం’

తెలుగులో ఘన విజయం సాధించిన ‘సీతారామం’ ఇప్పుడు బాలీవుడ్‌లో సందడి చేయటానికి సిద్ధం అవుతోంది. హీరో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇప్పుడు సెప్టెంబర్‌ 2న బాలీవుడ్‌లో విడుదల కాబోతుంది. హీరోయిన్‌ రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా ఘన విజయం సాధించింది.