కర్నూలులో సోనూసూద్‌ మొట్టమొదటి ఆక్సిజన్‌ ప్లాంట్‌

కరోనా బాధితులకు సోనూసూద్‌ చేస్తున్న ఎన్నో సహాయక చర్యల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాలు ఒకటి. ఇప్పటికే యుఎస్‌, ఫ్రాన్స్‌ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను తెప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని వివిధ రాష్ట్రాల్లో అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను మన రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.