సమస్యలను పరిష్కరించవచ్చు :సోనూసూద్‌

కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో సాయం కోరుతూ ఎంతోమంది సోనూకి ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ”సాయం కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. కానీ, వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా? అని బాధగా అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి… ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు” అని సోనూసూద్‌ పేర్కొన్నారు.