మరో సారి క్రేజీ హిట్ కాబినేషన్ లో సినిమా..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న త్రిష. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మరల పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో సత్తా చాటి రేసులోకి వచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ప్రెజెంట్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్‌ చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక తమిళంలో అజిత్ అండ్ కమల్ హాసన్ సినిమాలకు సైన్ చేసారు. ఈ ఇద్దరి హీరోలతో త్రిష గతంలో కలిసి నటించారు. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు అజిత్ అండ్ కమల్ తో జత కడుతున్నారు. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా పాత కాంబినేషన్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈక్రమంలోనే ఆల్రెడీ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకి సైన్ చేసారు. ఇటీవలే చిరుతో పాటు షూటింగ్ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టారు. చిరంజీవి, త్రిష గతంలో ‘స్టాలిన్’లో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు విశ్వంభరతో స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారు. చిరంజీవితో పాటు వెంకటేష్‌తో కూడా త్రిష రీ యూనియన్ అవుతున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న వెంకటేష్ – త్రిష.. ఆ తర్వాత నమో వెంకటేష్, బాడీగార్డ్ తో అలరించారు. మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్దమవుతున్నారట. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తుండగా… ఇక ఈ మూవీలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్. మరి ఓల్డ్ కాంబినేషన్స్ తో వస్తున్న త్రిష ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.