‘విక్రమ్‌ గౌడ్‌’ స్పెషల్‌ పోస్టర్‌

కన్నడ యంగ్‌ హీరో కిరణ్‌ రాజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్‌’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.