ఎస్పీ చరణ్‌ సారథ్యంలో పాడుతా తీయగా

తెలుగు సినీ సంగీత ప్రియుల అభిమానాన్ని పొందిన పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసిందని తెలిపారు. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు తెలిపింది. కొద్దిరోజుల్లో కనుల, వీనులపండుగా ఈటీవీ బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్‌పీ చరణ్ స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.