టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ త్రిష..!

నాలుగు పదులు దాటిన ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది త్రిష. చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే మరింత బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ పక్కన ‘లియో’ లో నటించగా.. ప్రస్తుతం అజిత్‌తో కలిసి ‘విడా ముయరాచి’ అనే సినిమాలో కనిపించనుంది ఈ బ్యూటీ.

ఇది మాత్రమే కాకుండా కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ లో కూడా త్రిష నటిస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే రీసెంట్‌గా తెలుగులో చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’లోనూ త్రిష హీరోయిన్‌గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా దీంతో పాటు టాలీవుడ్ లో మరో సినిమాలో కూడా నటిస్తోందట త్రిష.

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ హీరో వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన ‘F2’, ‘F3’ చిత్రాలు ఆడియన్స్‌ను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించనుంది అంటూ పలు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ త్రిష కాంబినేషన్ లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘బాడీగార్డ్’, ‘నమో వెంకటేశ’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు బాగా అలరించాయి. కాగా ఇప్పుడు నాలుగో సారి కూడా జతకట్ట బోతునట్లుగా తెలుస్తోంది.