Modi హౌసింగ్ స్కీమ్! నెలకు అద్దె రూ

మోడీ హౌసింగ్ స్కీమ్! నెలకు అద్దె రూ.1,000 మాత్రమే?

వలస కార్మికులు వంటి వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ వీరి కోసం త్వరలోనే రెంటల్ హౌసింగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. విద్యార్థులు కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రెంటల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తక్కువ అద్దెకే రూమ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇంటి అద్దె రూ.1,000 నుంచి ప్రారంభం కావొచ్చు. గరిష్టంగా రూ.3,000 వరకు ఉండొచ్చు. అయితే ఈ రెంట్ అంశంపై అంతిమ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికి అయితే అధికారికంగా ఈ విషయం వెల్లడికాలేదు. హౌసింగ్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ స్కీమ్ కోసం తొలి విడత కింద రూ.700 కోట్లను కేటాయించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రకటన చేశారు. యూపీఏ ప్రభుత్వం కూడా రాజీవ్ ఆవాస్ యోజన, జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ అనే రెండు స్కీమ్‌ను అందించేది. వీటి స్థానంలో కొత్త స్కీమ్‌ను తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది.