మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంట. అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?” అంటే ప్రశ్నార్థంతో పెట్టడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ చిత్రంలో సుమంత్ పాత్ర బాగా వంట చేయగలడట, ఒంటరిగా ఉంటాడట. ఈ క్వాలిఫికేషన్స్ తంటాలన్నీ సుమంత్ రీమ్యారేజీ కోసమేనని అర్థమవుతోంది.