చిరు సినిమాలో మహేష్

చిరు సినిమాలో మహేష్..ఫ్యాన్స్ కి రచ్చ రచ్చే..!

ఫ్యాన్స్ కల మొత్తానికి నెరవేరింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అది కన్‌‌ఫర్మ్ అని తేలిపోయింది.

మహేష్ బాబుకి ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు దర్శకుడు కొరటాల శివ. ఆ నమ్మకంతోనే ప్రస్తుతం తాను చిరుతో చేస్తున్న సినిమాలో మహేష్‌ కోసం కూడా కీలక పాత్ర రాసుకున్నారు. ‘భరత్ అనే నేను’తో మంచి హిట్ ఇచ్చారు కాబట్టి తాను చెప్పిన కథను మహేష్ కాదనరు అన్న ధైర్యంతో కథ వినిపించారు. ఇందుకు మహేష్ ఓకే చెప్పేసారు.