మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు చెప్తే నమ్మరు కాని… ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు మహేష్ బాబు. ఈ వీడియోలను మహేష్ బాబు సతీమణి నమ్రత షేర్ చూస్తుంటుంది కూడా.

అయితే మహేష్ బాబు ఏమి తింటారో తెలియదు కాని.. ఓ రెస్టారెంట్ నుంచి మాత్రం ప్రతిరోజు ఆయనకు ఇష్టమైన గుత్తివంకాయ పలావ్ వెళ్తూ ఉంటుందట. ఆ హోటల్ పేరే ‘ఉలవచారు’. హా!! ఆ రెస్టారెంట్ పేరు ఉలవచారే.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో… అదే మన బాలయ్య బాబుగారి ఇంటి పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్. ఈ హోటల్ నుంచి మహేష్ బాబుకి ప్రతి రోజు ‘గుత్తి వంకాయ పలావ్’ పంపిస్తూ ఉంటామని అంటున్నారు హోటల్ నిర్వాహకులు.