జూలై 31న మహేశ్‌ ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు త‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.

‘సర్కారువారి పాట’ సినిమాను ప్రకటించినప్ప‌టి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్‌ ప్రతి ఒక్కరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసింది. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సిద్ధమైయ్యారు. ఈ ఫ‌స్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లో మహేశ్‌బాబు చేతి