కంగనా సెక్యూరిటీ ఖర్చు ఎంతో తెలుసా?

కంగనాకు కేంద్రం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కంగనా సెక్యూరిటీ ఖర్చు ఎంత? ఆ ఖర్చు భరిస్తోంది ఎవరు? అన్న చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం కంగనా సెక్యూరిటీ నెల ఖర్చు రూ.10 లక్షలని తెలిసింది. ఈ భారీ మొత్తాన్ని కంగనా భరించడం లేదట. షాకింగ్‌ విషయం ఏంటంటే ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివసేనపై కంగనా తిరుగుబాటును తనకు అనుకూలంగా వాడుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆమెకు భద్రత ఖర్చులను భరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.