హీరో సూర్య మరోసారి తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘వారనమ్ ఆయిరమ్’ (సూర్య సన్నాఫ్ కృష్ణన్), విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘24’ చిత్రాల్లో సూర్య తండ్రీకొడుకు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘వాడీ వాసల్’ అనే చిత్రంలోనూ తండ్రీకొడుకుగా నటించనున్నారట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రారంభించనున్నారు. తమిళనాడులో ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు ఆధారంగా ఈ చిత్రం నిర్మించనున్నారు. జల్లికట్టులో ...
Read More »