శ్రీకాకుళం సబ్జైల్కి అచ్చెన్నాయుడును తరలించారు. అచ్చెన్నాయుడికి 14రోజులపాటు కోటబమ్మాళి కోర్టు రిమాండ్ విధించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అచ్చెన్నాయుడుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఐపీసీ సెక్షన్ 147,148, 324, 307,384, 506, 341,120(b),109, 188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్పీఏ 1951 కింద కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, బెదిరింపులకు పాల్పడటం వంటి పలు సెక్షన్లపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు.
Read More »Tag Archives: acham naidu
విజయవాడకు అచ్చెన్నాయుడు.. ఈఎస్ఐ ఆస్పత్రిలో పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు.ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ...
Read More »