మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉంటున్న ఒక వ్యక్తిని శనివారం అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించాక అసలు విషయం తెలుసుకుని అవాక్కవడం అధికారుల వంతయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. భారతీయ సంతతికి చెందిన 36 ఏళ్ల ఆదిత్య సింగ్ కరోనా సోకుతుందేమోనన్న భయంతో విమానాశ్రయంలోనే ఉండిపోయినట్లు వివరించాడు. కాగా, ఆదిత్య సింగ్ కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్ శివారులో నివసిస్తున్నాడు. హాస్పటాలిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 19న లాస్ ఏంజిల్స్ నుండి విమానంలో చికాగోలోని ఓహెర్ విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుండి అక్కడే ...
Read More »