Tag Archives: amaravathi formers

అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్‌ విడుదల

అమరావతి రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు చెల్లింపునకు రూ.158 కోట్లు, రెండు నెలల పెన్షన్‌ చెల్లింపునకు రూ.9.73 కోట్లు ఆయా రైతులు, రైతు కూలీల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బత్స సత్యనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని రైతు కూలీల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదని తెలిపారు. అందువల్లే ఈసారి రూ.2,500 ...

Read More »

నేడు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్

నేడు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్

మందడంలో పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. మరోవైపు అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు 67వ రోజుకు చేరుకున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయిపాలెం, రాయవుడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

Read More »