దేశ రాజధాని న్యూఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. జూలై చివరినాటికి ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండని పరిస్థితి నెలకొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. అయితే ఆయన అంచనా సరైనదా? కాదా? అని విషయంపై స్పందించబోనని తెలిపారు. కానీ సిసోడియా మాటల వల్ల ప్రజల మనసులో భయం వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం ...
Read More »Tag Archives: amith shah
రేవు అమిత్ షా తో భేటీ కానున్న సీఎం జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు వివరించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకురానున్నారు. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వీరిద్దరు చర్చించనున్నారు.
Read More »ప్రధాని మోదీపై అమిత్ షా ప్రశంసలు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ ...
Read More »రేపు మరోసారి ఢిల్లీ కి సీఎం జగన్
రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. రేపు సాయంత్రం అమిత్‌షాతో జగన్ భేటీకానున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం ఈ భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
Read More »