Tag Archives: ap cm ys jagan

ఏపీలో ఆసరా పథకం ప్రారంభం

ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. డ్వాక్రా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చారు. అంతేకాదు త్వరలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు నిర్వహించాలన ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,71,302 లక్షల డ్వాక్రా సంఘాలకు చెందిన 87,74,674 లక్షల మహిళలకు ఆసరా పథకంలో ఆర్థిక సహాయం అందనుంది. మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు సీఎం. 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ...

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శనివారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ (శుక్రవారం) ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ ...

Read More »

డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి గడపకు ...

Read More »

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన ...

Read More »

అత్యుత్తమ సీఎంలలో వైఎస్‌ జగన్‌కు మూడో స్థానం

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(6), మహారాష్ట్ర ...

Read More »

సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Read More »

వంగపండు మృతికి సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నా’యంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు మృతిపట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read More »

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ...

Read More »

“నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకావిష్కరణ

"నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకావిష్కరణ

దివంగత మహానేత, మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్నను చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు.వైఎస్‌ ...

Read More »

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షలో సీఎం జగన్‌

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షలో సీఎం జగన్‌

కోవిడ్‌–19 కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందాలని, అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ ఏ లోటు ఉండరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రోగులకు సదుపాయాల విషయంలో, వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఔషధాలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. కరోనా మైల్డ్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాలలో కనీసం ...

Read More »