Tag Archives: ap cm

ఎన్నికల తర్వాత రాజధాని వైజాగే…ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా

ఎన్నికల తర్వాత రాజధాని వైజాగే…ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ జిసిఎంసీ పరిధిలో 1500కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌….అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని… మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని చెప్పారు సీఎం జగన్. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల ...

Read More »

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం: జగన్

2022లో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా.. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672 కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ...

Read More »

స్కోచ్ అవార్డుల్లో ఏపీకి మూడో స్థానం

ఏపీ ప్రభుత్వానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.పటిష్ట పరిపాలనతో ప్రజలకు చేరువైన జగనన్న ప్రభుత్వానికి స్కోచ్ అవార్డు లభించింది. ఏపీలో ఇంతవరకు ఏ ప్రభుత్వాలూ చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని చేర్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు… ఇంటివద్దకు రేషన్… పెన్షన్ .. ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైయస్ జగన్ ప్రతి ఇంటికి పధకాలను తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ ...

Read More »

ఢిల్లీలో ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ..

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ ...

Read More »

జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం

దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.  

Read More »

జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.

Read More »

బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: జగన్‌

చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు.  ...

Read More »

భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఏపీ మంత్రి రోజా, కేంద్ర మాజీ మంత్రులు, చిరంజీవి, పురందేశ్వరీ తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం ...

Read More »

పేదలకు సంక్షేమ పథకాలు ఆపేయాలని ఎల్లో బ్యాచ్ అంటోంది : జగన్

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని జగన్ ఆరోపించారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు పాలన కావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ మండిపడ్డారు.

Read More »

కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ

బహ్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. బహ్రెయిన్ లో ఏపీకి చెందిన అత్యధిక మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే అక్కడి కంపెనీలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, త్వరగా కంపెనీలు వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

Read More »