Tag Archives: ap cs

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతల స్వీకరణ

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ నియామకానికి జగన్‌ ఆమోదించారు. సాహ్ని సీఎం ముఖ్యసలహాదారుగా నియమితులయ్యారు.

Read More »

స్థానిక ఎన్నికలపై మరోసారి సిఎస్‌ కు నిమ్మగడ్డ లేఖ

ఎపి స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి సిఎస్‌ కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. ఈ లేఖలో కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్‌ ప్రస్తావించారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌ తోపాటు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్‌ కు కూడా నిమ్మగడ్డ లేఖ రాశారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని లేఖలో సూచించారు

Read More »

తక్షణ సాయం అందించండి : సిఎస్‌ నీలం సాహ్ని

తుపాను, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం అందేలా చూడాలని సిఎస్‌ నీలం సాహ్ని కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం సచివాలయంలో వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రబృందం పరిశీలించింది. అనంతరం సౌరవ్‌ రారు నేతఅత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బఅందం వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల వారీ జరిగిన నష్టం వివరాలను వివరించారు. రైతుల నుండి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని, దెబ్బతిన్న వేరుశెనగ పంటను ...

Read More »

సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Read More »

ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ...

Read More »