Tag Archives: AP disha act

మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: మేకతోటి సుచరిత

మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం

మహిళల భద్రత కోసమే సీఎం జగన్‌ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ చట్టం పట్ల ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే బాధితులకు న్యాయ జరిగేలా నిందితులకు శిక్ష పడుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం జగన్‌ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.  చట్టం ...

Read More »

రేపు దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

రేపు దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో తొలి స్టేషన్‌ ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

Read More »