Tag Archives: ap governor

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను గవర్నర్‌ ఆదేశించాలని కోరారు. వీటితో పాటు తాజాగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఎస్‌ఈసీ గవర్నర్‌కు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోన్న ...

Read More »

కరోనా నివారణకు అందరూ సహకరించాలి

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు ఈరోజు. స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, ...

Read More »

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.రాజధానిపై ...

Read More »

గవర్నర్‌ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’

‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్‌ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 197 క్లాజ్‌ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.

Read More »

యోగాతో ఆరోగ్యంగా ఉండండి: ఏపీ గవర్నర్‌

యోగాతో ఆరోగ్యంగా ఉండండి: ఏపీ గవర్నర్‌

యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి)ను అనుసరించి ఈ నెల 21న (ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్‌ శనివారమిక్కడ మాట్లాడుతూ యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమన్నారు.యోగా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సాయం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనతో ఐరాస జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిందన్నారు. కరోనా ...

Read More »

ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్‌ శుభాకాంక్షలు

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్‌ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆయన ఆదివారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్‌ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు.రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్‌ చెప్పారు. క్రమశిక్షణను ...

Read More »

రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే జరుపుకోవాలి -ఏపీ గవర్నర్

రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే జరుపుకోవాలి -ఏపీ గవర్నర్

రంజాన్ ప్రార్ధనలు ఇంటి వద్ద నుంచే నిర్వహించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కోరారు. నేడు ఆయన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ‌వ‌ర్న‌ర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట దశలో ఉందని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో అన్ని వర్గాల ప్రజలు అధికారులతో సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం జనాభాను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు

Read More »

అంబేద్కర్‌కు ఏపీ గవర్నర్‌ ఘన నివాళి

అంబేద్కర్‌కు ఏపీ గవర్నర్‌ ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌ దర్బార్‌హాల్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు యావత్‌ భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోంది.గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన దేశ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉంటారని’ పేర్కొన్నారు.

Read More »

కరోనాని తరిమి కొడదాం -ఏపీ గవర్నర్

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం నాడు ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు రాష్ట్ర ప్రజలంతా ప్రతిస్పందించాలని రాష్ట్ర‌ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కోరారు.. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ.. నేడు రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి, ఇంట్లోని విద్యుత్ దీపాల‌ను ఆపివేసి, జ్యోతులు వెలిగించి ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు … ఇలా ఏదో ఒక రూపంలో కాంతిని ...

Read More »

కరోనా పై స్పందించిన ఏపీ గవర్నర్

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై యుద్ధాన్ని గెలవచ్చని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఏపీ రాజ్‌భవన్‌లో మాట్లాడుతూ.. ప్రజలు ఇంట్లో ఉండాలని, ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే మీ చేతులను తరచూ హ్యాండ్‌ శానిటైజర్లతో కడగాలని తెలిపారు. ఫేస్‌ మాస్క్‌లతో ముఖాన్ని కప్పుకోవాలని, చేతితో తాకిన ఉపరితలాలను శుభ్రపరచాలని పేర్కొన్నారు సామాజిక ...

Read More »