Tag Archives: ap govt

ఏపీలో ఇకపై ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం

ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్రం ప్రభుత్వం పేర్కొంది. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఆ రోజున సన్మానించుకోవాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ...

Read More »

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లను విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More »

నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు

నేటి నుంచి ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 4,73,058 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారు. మార్చి 2 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 4,88,881 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1,559 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 57 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమస్యలపై ఫిర్యాదులకు రెండు కంట్రోల్ ...

Read More »

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Read More »

ఏపీ డీఎస్సీ-2024: దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏపీలో 6,100 టీచర్ పోస్టులతో ఇటీవల డీఎస్సీ ప్రకటించారు. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వాస్తవానికి నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడువు ముగియనుంది. అయితే, ఆ గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నేడు ప్రకటించింది. డీఎస్సీ అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్టు తెలిపింది. https://apdsc.apcfss.in/ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తును ఎడిట్ చేసుకుని తప్పులను సరిచేసుకోవచ్చని సూచించింది.

Read More »

పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం

సాధారణంగా చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ… పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని తెలిపారు. ...

Read More »

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

రిటైర్డ్ RTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం 2 ఆరోగ్య పథకాలను వర్తింపజేయనుంది. 2020, JAN 1 నాటికి రిటైరైన వారికి రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీం అమలు చేయనుంది. ఇక ప్రభుత్వంలో విలీనం తర్వాత రిటైరైన ఉద్యోగులకు EHSను అందించనుంది. REMS ద్వారా దాదాపు 25వేల మంది ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. అలాగే EHS పరిధిలోకి విజయవాడ, కడప RTC ఆస్పత్రులను ప్రభుత్వం తీసుకొచ్చింది.

Read More »

నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో టీచర్ పోస్టుల నియామకాలకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు…మొత్తం పోస్టులు: 6,100ఎస్జీటీల సంఖ్య: 2,280స్కూల్ అసిస్టెంట్లు: 2,299టీజీటీలు: 1,264పీజీటీలు: 215ప్రిన్సిపాల్స్: 42

Read More »

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. జగన్ గురించి ఏం మాట్లాడాడో తెలుసా..?

Ap film corporation development chairman posani

ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ...

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ.. సంబంధిత ...

Read More »