Tag Archives: ap minister

ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి: విడదల రజని

గుంటూరు కలెక్టరేట్‌లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై ఏపీ మంత్రి విడదల రజని ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ర్పచారం చేస్తున్నారని, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయని విలేకర్లు ప్రస్తావించగా విడదల రజని ఈ విధంగా స్పందించారు. అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్యలు తీసుకుంటామని ...

Read More »

నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కరోనా ...

Read More »

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుంది -బుగ్గన

విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోందని, లాక్‌ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం ...

Read More »

పరీక్షలు లేకుండానే పై తరగతికి -మంత్రి ఆదిమూలపు సురేష్

పరీక్షలు లేకుండానే పై తరగతికి -మంత్రి ఆదిమూలపు సురేష్

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని మంత్రి ...

Read More »

ఆ ఘనత జగన్ కే సొంతం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆ ఘనత జగన్ కే సొంతం

తొమ్మిది నెలలకే 90 శాతం హామీలు నెరివేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా కుప్పం కు నీరందిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు.

Read More »