Tag Archives: ap news

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి ఆళ్ల నాని

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)పేర్కొన్నారు. స్థానిక సాలిపేట సాయి సుధ హాస్పిటల్ ప్రక్కన డా.వాడ్రేవు రవి ఏర్పాటు చేసిన అధునాతన ఎ వాన్ రోగనిర్ధారణ కేంద్రం నూతన భవనంను మంత్రులు ఆళ్ల నాని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. మూడు అంతస్తుల భవనంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏర్పాటు చేసిన ఎమ్మార్ఐ, సిటీ స్కాన్ రెవల్యూషన్ ఏసీటీ, అల్ట్రా సౌండ్, ...

Read More »

యుపి సిఎంగా యోగి ప్రమాణం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి యోగి ఆదిత్యనాధ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.. ఆయనతో గవర్నర్ ఆనందీ బెన్ పాటిల్ ప్రమాణం చేయించారు.  లక్నోలోని వాజ్ ఫేయి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, 37 ఏళ్ల తర్వాత అక్కడ రికార్డు నెలకొంది. ఐదేళ్ల  పదవీకాలాన్ని పూర్తి చేసి, రెండవ దఫా ...

Read More »

జంగారెడ్డి గూడెం ఘటనపై దద్దరిల్లిన ఉభయసభలు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలపై సోమవారం ఉభయ సభలు దద్దరిల్లాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సోమవారం శాసనసభలోనూ, శాసనమండలిలోనూ ఈ విషయంపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుపట్టారు. రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురికావడంతో టిడిపి సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో శాసనసభలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. సారా తాగినందువల్లే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించిన టిడిపి సభ్యులు దీనికి బాధ్యత వహించి సిఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ...

Read More »

త్వరలో మంత్రివర్గంలో మార్పులు-క్యాబినెట్లో సంకేతాలు ఇచ్చిన జగన్‌

మంత్రివర్గమార్పు త్వరలో జరగనున్నట్లు సిఎం జగన్‌ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ సమయంలో సిఎం మాట్లాడుతూ కొత్తగా పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారని, ఈమేరకు గతంలో మాట ఇచ్చామని తెలిపారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉన్న రీత్యా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కొంతమంది పార్టీ పదవులు తీసుకుని జిల్లాలో పార్టీని గెలిపించాలని సూచించారు. రాబోయే ప్రభత్వుంలో మరలా మంత్రివర్గంలో వారికి అవకాశం ఉంటుందని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి ...

Read More »

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) నిర్ణయించింది. మొత్తం 13 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా టిడిపి సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై సిఎం జగన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘ గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు ‘ వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని సిఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ముఖ్యమంత్రి జగన్‌ టిడిపి నేత అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. మరోవైపు వెలగపూడిలోని ...

Read More »

ఏప్రిల్‌ 22 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. కొత్త పరీక్షల షెడ్యూల్‌ను సచివాలయంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుతో కలిసి గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జెఇఇ మొదటి విడత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 8 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ...

Read More »

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read More »

సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కేఎస్‌.జవహార్‌ రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

Read More »

విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..మేకపాటి

విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబారు ఎక్స్‌ పోలో ఏపీ పెవిలియన్‌ రూపకల్పన చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య జరగనున్న ఎక్స్‌ పోకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హాజరవుతోన్నది. ఈ సందర్భంగా దుబరు ఎక్స్‌ పో -2022 సన్నద్ధత ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఎక్స్‌ పో సన్నద్ధత ఏర్పాట్ల పట్ల పరిశ్రమల శాఖ కఅషిని మంత్రి అభినందించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ప్రత్యేకమని ...

Read More »

ఏపీ ప్రజలకు గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్‌ వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ ...

Read More »