Tag Archives: ap news

18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ భేటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను 16వ తేదీన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకరు నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల స్పెషల్‌ సిఎస్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ శాసనసభ సచివాలయ కార్యదర్శి లేఖ రాశారు. ఇదే సమయంలో 17వ తేదీన మంత్రివర్గం కూడా ...

Read More »

నామినేషన్ల తిరస్కరణపై ఎపి హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌లో టిడిపి తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌ఒ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు ...

Read More »

నేటి నుండి రాజధాని రైతుల మహా పాదయాత్ర

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది, పది గంటల మధ్మలో ప్రారంభం కానున్న ఈ యాత్రను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం నుండి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుండి తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే ఈ ...

Read More »

ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న నిర్వహిస్తామని ఎపి డిజిపి గౌతం సవాంగ్‌ తెలిపారు. బుధవారం గౌతం సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామన్నారు. సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు పని చేస్తారని అన్నారు. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు పని చేస్తారని అన్నారు. గత సంవత్సరం పోలీసులకు కోవిడ్‌ కారణంగా ఒక ఛాలెంజ్‌ ఎదురయ్యిందని, పోలీసులు కోవిడ్‌ ...

Read More »

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ,  వెల్లంపల్లి శ్రీనివాస్,  పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Read More »

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రేపు ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రానున్న సందర్భంగా.. ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులు సోమవారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) డాక్టర్‌ కె.మాధవిలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)కె.మోహన్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ లు పరిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత ఆదేశించారు. మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని ...

Read More »

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

 ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ లో కేవలం వారం రోజుల ముందు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే ...

Read More »

ఏపీ లో ఆరుగురు ఐఎఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఎంఆర్‌డిఎ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఎ అప్పిల్స్‌ కమిషనర్‌గా డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహం, ఎఎంఆర్‌డిఎ అడిషనల్‌ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివఅద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్‌డిఒ గా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా పఅథ్వీ తేజ్‌ బదిలీ అయ్యారు. ఎపి పవర్‌ కార్పొరేషన్‌ ఎండి గా పఅథ్వీతేజ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. 

Read More »

జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్‌

ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు.

Read More »

భీమవరంలోజగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. సిఎం పర్యటన వేళ.. భీమవరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సిఎం జగన్‌ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి కె.శ్రీధర్‌, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.

Read More »