రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా బలమైన కేంద్రం ఉండాలనే ఆర్ఎస్ఎస్ అజెండాకు అనుగుణంగానే మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉంది. బోర్డుల పరిధి, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతులు వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని చెప్పడం రాష్ట్రాల హక్కులను హరించడమే. ట్రిబ్యునల్ కేటాయిపుల ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను చేపట్టడం సర్వసాధారణం.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారం. ప్రాజెక్టుల నిర్వహణ ...
Read More »Tag Archives: ap
ఏపీ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ...
Read More »ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. ...
Read More »మంత్రి వేణును కలిసిన ఐఏఎస్ అధికారులు
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను పలువురు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్అండ్బి అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి వేణును జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్–19 నియంత్రణ చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివేణు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ...
Read More »సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్‌కలెక్టర్‌గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ప్రతిస్త, అమలాపురం సబ్‌కలెక్టర్‌గా హిమాన్షు, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా భార్గవ్‌తేజ, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా విధేకర్, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా మౌర్య, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌గా అజయ్‌కుమార్, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా అంజలి, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ధనుంజయ్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా జాహ్నవి, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎంఎస్ మురళి ఉన్నారు.
Read More »ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ.. సంబంధిత ...
Read More »మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.రాజధానిపై ...
Read More »గవర్నర్ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’
‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.
Read More »14 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం
గడిచిన రెండు నెలలుగా తెలంగాణ నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలించిన సుమారు రూ.70 లక్షల విలువ చేసే 14వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు శుక్రవారం ఇక్కడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈబీ డైరెక్టర్ సీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని జిల్లా పోలీసులు కట్టడి చేసిన తీరు అభినందనీయమన్నారు.
Read More »ఏపీ లో 12 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
కరోనా పరీక్షల్లో రాష్ట్రం 12 లక్షల మైలు రాయిని అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా పరీక్షల సంఖ్య 12,17,963కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు పరీశీలించిన నమూనాల్లో 2,432 మందికి వైరస్ సోకింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 911 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనా ...
Read More »