Tag Archives: ap

ఏపీలో మరో 50 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో(గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) 9,831 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కు చేరింది. వైరస్‌తో నిన్న ఇద్దరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Read More »

ఏపీలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం కోవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3279 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 2244 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి 68 మంది మృతి చెందారు.

Read More »

ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు

Read More »

ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు

ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 76 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 76 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,169 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు సంఖ్య 885గా ఉంది.

Read More »

ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌

ఏపీ ఎన్నికల కమిషన్‌ నూతన కార్యదర్శిగా వాణీ మోహన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ వాణీ మోహన్‌కు ఈ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.

Read More »

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 54 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టుగా తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు

Read More »

ఏపీలో మరో 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,719కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 55 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 1903 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 57 ...

Read More »

ఏపీలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,671కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది

Read More »

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2514కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 62 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1731కి చేరింది. కరోనాతో ఇవాళ ...

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెలకు ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు అందుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి ...

Read More »