Tag Archives: aravind kejriwal

మోడీని కలుసుకోనున్న కేజ్రీవాల్

మోడీని కలుసుకోనున్న కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు కలుసుకోనున్నారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో మధ్యాహ్నం 11 గంటలకు కేజ్రీవాల్ ప్రధానిని కలుస్తారు. కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానిని కలుసుకోనుండటం ఇదే మొదటిసారి. ఈశాన్య ఢిల్లీని అట్టుడికించి 47 మంది మృతికి దారితీసిన అల్లర్ల తర్వాత ప్రధానితో ఆయన సమావేశవుతుండటం కూడా ఇదే ప్రథమం.

Read More »

16న కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం

16న కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్‌ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్‌ కొత్తఎమ్మెల్యేలతో తన ...

Read More »

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభినందనలు తెలిపారు. ‘ఢిల్లీ ఎన్నికలు-2020లో ఘనవిజయ సాధించిన ఆప్‌కు, అరవింద్ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు. రాబోయే ఐదేళ్లలో మరింత విజయవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని జగన్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »