Tag Archives: arogya sree

ఏపీ సీఎం సహాయనిధికి విరాళం

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నవ్యాంధ్రప్రదేశ్‌ తరపున 1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. 285 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అసోసియేషన్‌ ప్రతినిథులు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కె మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ త్రినాథ్ తదితరులు ఉన్నారు.

Read More »

ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభం

రోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ...

Read More »

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధులు విడుదల

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు నిధులు విడుదల

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసే ఆసుపత్రులకు రూ.234 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులతో వైద్యం చేసిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేశామన్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు రూ.127 కోట్లు విడుదల చేశామన్నారు.

Read More »