Tag Archives: chandrababu

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: సీఎం జగన్

సీఎం జగన్ ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అని సమర శంఖం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. రేపటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి… ...

Read More »

జగన్ బస్సు యాత్ర ఒక చరిత్ర: ఎమ్మెల్సీ తలశిల రఘురాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్ర కొనసాగుతున్న రహదారులు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ… ఇప్పటి వరకు బస్సు యాత్ర 2100 కిలోమీటర్ల మేర కొనసాగిందని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగినా వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రఘురాం విమర్శలు గుప్పించారు. ...

Read More »

మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : YCP

ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ ప్రశ్నించింది. ‘చంద్రబాబూ చూశావా ముస్లింలపై బీజేపీ నిజస్వరూపం! దేశ సంపద ముస్లింలకు ఇస్తే ఊరుకుంటామా? అని స్వయంగా మోదీ గారే చెప్తున్నారు. అలాంటి బీజేపీతో నువ్వు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా? లేదా మైనారిటీల పక్షాన నిలబడి వ్యతిరేకించే దమ్ము టీడీపీ, జనసేనలకు ఉందా?’ అని YCP ట్వీట్ చేసింది.

Read More »

నేను సీబీఐ విచారణకు సిద్ధం.. నువ్వు రెడీనా చంద్రబాబూ?: కాకాణి

తాను సహజ వనరులను దోచేశానంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఆ అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఆయనకు ఉందా? సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తాను రండి. ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేక నాపై విమర్శలు చేసి వెళ్లిపోయారు’ అని మండిపడ్డారు.

Read More »

బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి

వచ్చేనెల మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ...

Read More »

ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తనను బచ్చా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబును చూస్తుంటే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని సెటైర్లు వేశారు.. తనను బచ్చా అన్న వ్యక్తి పది మందిని వెంటవేసుకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని నన్ను చుట్టుముట్టారని వ్యాఖ్యానించారు. కానీ తాను ...

Read More »

ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్: వాసిరెడ్డి పద్మ

టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్సార్‌సీపీ నాయకులు,సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? ...

Read More »

జగన్‌ పై రాయి దాడి…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ పై రాయి దాడి జరుగడంపై…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి అమానుషమని మండిపడ్డారు. జగన్ కు రాయి తగలడం టీవీలో లైవ్ చూసానని తెలిపారు. ముందు రాయి అనుకోలేదని…రాయి గట్టిగానే తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు కానీ వాళ్లకు తాగలేదంటూ ఎద్దేవా చేశారు.

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ ...

Read More »

చంద్రబాబుకు నాపై కోపం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెపథ్యంలో సీఎం జగన్ మాట్లడుతూ చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని..చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తోంది. హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకువస్తాయి అని విమర్శించారు.

Read More »