Tag Archives: chiranjeevi

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్

అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరూ తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

Read More »

‘భోళా శంకర్’ షూటింగ్ షురూ

టాలీవుడ్ హీరో చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రాల్లో ఒక‌టి భోళా శంక‌ర్ . వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న ఈ మూవీని మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌నుంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. భోళాశంక‌ర్ టీం నుంచి ఆస‌క్తిక‌ర వార్త తెర‌పైకి వ‌చ్చింది. న‌వంబ‌ర్ 6న సినిమాను లాంఛ్ చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్ 15 నుంచి భోళా శంక‌ర్ షూటింగ్ షురూ కానుంది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, కీర్తిసురేశ్‌పై వ‌చ్చే ...

Read More »

చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్‌ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్‌ అన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్‌, అలీ కూడా పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్‌ మరణం తీరని లోటన్న శ్రీకాంత్‌.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ...

Read More »

25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ...

Read More »

‘ఆచార్య‌’లో శ్రీ‌.శ్రీ?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య‌`. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో న‌క్స‌ల్ నేప‌థ్యం కూడా ఉంది. చిరు, చ‌ర‌ణ్ `అన్న‌లు`గా క‌నిపించ‌బోతున్నారు. అందుకు సంబంధించిన స్టిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. `ఆచార్య‌`లో ఓ భావోద్వేగ గీతం ఉంద‌ని తెలుస్తోంది. అభ్యుద‌య భావాల‌తో సాగే ఆ గీతంలో శ్రీ‌శ్రీ రాసిన పంక్తులు వినిపిస్తాయ‌ని స‌మాచారం. అయితే అది పాట‌గా వాడుకున్నారా? డైలాగుల‌తో స‌రిపెడ‌తారా? అనేది తెలియాల్సివుంది. శ్రీ‌శ్రీ రాసిన `నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిథ‌నొక్క‌టి ఆహుతిచ్చాను` ...

Read More »

మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవిపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన చిరంజీవి ”మీ దయగల మాటలకు ధన్యవాదాలు. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎంతోమంది రోగులు ...

Read More »

ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు..చిరంజీవి

కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్‌ ప్రభావంతో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో దర్శకుడు చిత్రీకరణను నిలిపివేశాడు. ఇప్పుడు ప్రస్తుతం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు రావడంతో చిత్రీకరణను మొదలుపెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఇంకా 15 రోజులు షూట్‌ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని కొరటాలకు చిరు సూచించారు. హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌, పూజాహెగ్డే ...

Read More »

ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ప్రారంభించిన చిరంజీవి

కరోనా క్రైసిస్‌ కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి సేవాకార్యక్రమాల్ని విస్తరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయన ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల్ని తన అభిమాన సంఘాల అధ్యక్షులే ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. అత్యవసరంలో ఉన్న కరోనా రోగుల్ని తక్షణం ఆదుకునేందుకు ఆస్పత్రులతో ఆక్సిజన్‌ సరఫరా దారులతో సంబంధాల్ని కొనసాగిస్తూ ఆదుకునే ప్రయత్నమిది. దీనికోసం హైదరాబాద్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తొలి విడత ఆక్సిజన్‌ సిలిండర్లు.. కాన్‌ సన్‌ ట్రేటర్లను మెగాస్టార్‌ పంపించారని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Read More »

నటుడు పొన్నాంబళానికి చిరు సాయం

మెగాస్టార్‌ చిరంజీవి తన ఉదారగుణాన్ని మరోసారి చాటుకున్నారు. నటుడు పొన్నాంబళం చికిత్సకు రెండు లక్షల రూపాయలను చిరు సాయం చేశారు. గత కొన్నేళ్లుగా ‘మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నానని.. ఎవరైనా చికిత్సకు సాయం చేయండి అని’ పొన్నాంబళం అభ్యర్థిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకన్న మెగాస్టార్‌.. చికిత్సకు రెండు లక్షల రూపాయలను డైరెక్ట్‌గా ఆయన బ్యాంక్‌ ఎకౌంట్‌కి పంపించారు. ఈ విషయాన్ని పొన్నాంబళమే స్వయంగా తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రెండు లక్షల రూపాయల్ని పంపిన చిరంజీవికి తానెప్పుడూ రుణపడి ఉంటాను ...

Read More »

ఆసుపత్రిలో చేరిన చిరంజీవి అల్లుడు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సామాన్యులు కరోనా బారినపడ్డారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ పోస్టుపై నటుడు నాగబాబుతోపాటు, నటి అవికాగోర్‌తో సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కళ్యాణ్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.

Read More »