Tag Archives: cm jagan

CM జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్

జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.

Read More »

మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్

పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్..?

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా,వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు కొడాలి నాని. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. చంద్రబాబుది మాయా కూటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడని మండిపడ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయన్నారు.

Read More »

సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

Read More »

ఇలాంటి దాడులు ఏమీ చేయలేవు.. గెలుపు మనదే: జగన్

విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే… ఈ దాడికి పాల్పడ్డారని వారు చెప్పారు. ఈ ...

Read More »

సీఎం జగన్కు భారీ భద్రత

ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్ షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Read More »

దాడి తర్వాత తొలిసారి బయటకు జగన్

మరికాసేపట్లో CM జగన్ 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలతో నవ్వుతూ, చాలా సరదాగా జగన్ మాట్లాడారు. అటు CMపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు కనిపిస్తుండగా.. దానిపై వైట్ బ్యాండెడ్ ఉంది. ఇక గాయం తీవ్రత నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని YCP శ్రేణులు కోరుకుంటున్నాయి.

Read More »

ఇల్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేనేతలతో సమావేశం అయ్యారు. ఈ సామావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో 54వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చెయ్యగా. వాటిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎలాగైతే సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరో అలానే పేదల జీవితాలు బాగుపడటాన్ని కూడా ఎవరూ ఆపలేరని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి రాగానే అందరికీ ఆ స్థలాలే ఇప్పిస్తామని తెలిపారు. ఏదైనా అనివార్య కారణాల చేత మీ బిడ్డ ఇచ్చిన ...

Read More »

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో ...

Read More »