Tag Archives: corona cases in india

దేశంలో మరో 53,601 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య ...

Read More »

భారత్ లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు వెలుగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత ప​డ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా బారిన పడగా, మంగళవారం నాటికి 39,795 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది

Read More »

భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు

Read More »

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9, 07,645కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23,727కు చేరింది. మహారాష్ట్రలో నిన్న(సోమవారం) 6,497 కేసులు నమోదవ్వగా ...

Read More »

24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 19వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. ...

Read More »

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది

Read More »

దేశంలో ఒక్క రోజే 7964 కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది ...

Read More »

భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది. కాగా కరోనా వైరస్‌ నుంచి 39,173 మంది పూర్తిగా కోలుకోగా, దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

Read More »

60 వేలకు దగ్గరలో కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో శనివారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59,662కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1981కి చేరింది. ఈ మహమ్మారి నుం​చి కోలుకొని 17,847 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం 39,834మంది చికిత్స పొందుతున్నారు.

Read More »