Tag Archives: corona effect

ఒక్కరోజులోనే 4987 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4987 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పాటు 124 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైరస్‌ వెలుగుచూసిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 927కి చేరుకుంది. ఇక వైరస్‌ సోకి 2872 మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 38,108 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ...

Read More »

సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు

సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు

కరోనా నియంత్రణకు తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. చెన్నైతో సహా పలు నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర సరిహద్దుల్లో గోడలు కట్టేస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో గల కాట్పాడి రాయవేలూరులలో 40కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ జిల్లా కలెక్టర్ షణ్ముఖ సుందరం ఆంధ్ర సరిహద్దుల్లోని జాతీయ రహదారి మినహా మిగతా అన్ని దారులు మూసి వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్ల మీద అడ్డంగా గోడలు నిర్మిస్తున్నారు

Read More »

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

తెలంగాణలో తాజాగా మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దోమలగూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నమూనాలు పరీక్షించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.

Read More »

వైట్ హౌస్ లో కరోనా కలకలం

వైట్ హౌస్ లో కరోనా కలకలం

మహమ్మారి కరోనా అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్‌హౌస్‌ను తాకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ‌ద్ద ప‌నిచేసే బృందంలో ఓ వ్యక్తికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్యులు నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైట్‌హౌజ్ అప్రమ‌త్తమైంది. వైట్‌హౌజ్‌లో ప‌నిచేస్తున్న వారిలో వైర‌స్ సోకిన తొలి వ్యక్తిగా అత‌న్ని గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన వ్యక్తితో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ దరిదాపుల్లోకి రాలేద‌ని వైట్‌హౌజ్ ...

Read More »

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత

కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో ...

Read More »

కరోనా ఎఫెక్ట్ :మోదీ బంగ్లా పర్యటన రద్దు ?

మూడు కరోనా కేసులు నమోదయ్యాయని బంగ్లాదేశ్‌ ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఢాకా పర్యటనను రద్దు చేసుకోవచ్చని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌ వ్యవస్ధాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 17న ప్రధాని మోదీ ఢాకా పర్యటన ఖరారైంది.కాగా ఇటలీ నుంచి ఢాకాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. వీరి బంధువైన మరొకరికీ కరోనా ...

Read More »