Tag Archives: corona

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్‌ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్‌ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 ...

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ… ద్రవిడ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌

మరో 4 రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా … టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్‌ ద్రవిడ్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వుంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ ...

Read More »

జులై 15 నుండి అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు

శవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌’లో భాగంగా బూస్టర్ డోస్ (ప్రీకాషన్ డోస్)   పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18 నుండి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read More »

దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నెమ్మదించినా.. కొన్ని దేశాల్లో వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల వ్యాప్తితో రికార్డు  స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల అనంతరం ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 8,524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల ...

Read More »

సింగర్‌ కౌసల్యకు కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (Coronavirus) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మూడో దశలో ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నా.. వైర‌స్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజ‌కీయ నాయకులు, సినీ స్టార్లు, ప‌లువురు సెల‌బ్రిటీలను క‌రోనా వెంటాడుతూనే ఉంటోంది. మూడో దశలో ఇప్ప‌టికే ఎంతో మంది వైర‌స్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

Read More »

మరో నటుడికి కరోనా

మలయాళ నటుడు జయరామ్‌కి కరోనా సోకింది. ఇటీవల మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, సురేష్‌ గోపీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని, వైరస్‌ ఇంకా మనతోనే ఉందని, మనకు గుర్తు చేస్తోందని అన్నారు. తనతో కాంటాక్ట్‌ లో ఉన్నవారు ఐసోలేట్‌ అవ్వాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్‌చేశారు. తాను ట్రీట్‌ మెంట్‌ మొదలు పెట్టానని, ...

Read More »

బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

బ్రిటన్‌లో కరోనా కల్లోల్లం సృష్టిస్తోంది. కోవిడ్‌ మొదలైన నాటి నుండి బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు ఎక్కువ. రాబోయే కొద్ది రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఉండవచ్చునని బ్రిటన్‌ సీనియర్‌ హెల్త్‌ చీఫ్‌ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 67 మిలియన్‌ మంది ప్రజలు ఉండగా.. ఇప్పటి వరకు 11 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నూతన ...

Read More »

ఒక్కరోజులో 13 శాతం పెరిగిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,466 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఒక్కరోజులో 13 శాతం మేర  పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 460 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,61,849కిచేరింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,39,683కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం 264 రోజుల ...

Read More »

ప్రపంచ దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్న కరోనా

 పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు. జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 ...

Read More »

దేశంలో 10 వేలకు తగ్గిన కరోనా కేసులు

దేశంలో తాజాగా కరోనా కేసులు 10 వేలకు తగ్గాయి. రికవరీ రేటు కూడా 98.23 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం… దేశంలో కోవిడ్‌ కేసులు ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, 10,929 కొత్త కేసులు వెలుగుచూశాయి. 392 మరణాలు నమోదయ్యాయి. తగ్గిన రికవరీ రేటు.. క్రియాశీల రేటు..దేశవ్యాప్తంగా కోవిడ్‌ రికవరీ రేటు, క్రియాశీల ...

Read More »