Tag Archives: corona

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మార్చి 31వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. గతంలో విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియ నుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోసారి నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. అయితే కార్గో విమానాలు, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. కాగా, భారత్‌ సుమారు 27 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దేశాల ...

Read More »

మహారాష్ట్రలో 186 మంది విద్యార్థులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. వాషిం జిల్లాలోని ఒక పాఠశాలకు చెందిన హాస్టల్‌లో 190 కరోనా కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 186 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని అన్నారు. దీంతో ఆ హాస్టల్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ విద్యార్థులు అమరావతి, యవాత్మల్‌ జిల్లాల నుండి వచ్చారని, ఈ రెండు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 8వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోతే.. కఠిన ...

Read More »

కరోనా నుండి కోలుకున్న సూర్య

సూర్య తనకు కరోనా సోకినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సూర్య సోదరుడు కార్తి తన అన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడని చెప్పేసరికి ఫ్యాన్స్‌ కాస్త కూల్‌ అయ్యారు. నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ సూర్యకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని, ఆయన పూర్తిగా కోలుకున్నారని, అభిమానులు ఆందోళన పడొద్దుని చెప్పారు.

Read More »

ఆ ఐదు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా

కరోనా తగ్గినట్లే తగ్గి..మరోసారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కేరళలో కరోనా కోరలు చాచుతోందని కేంద్రం ప్రకటించింది. నవంబర్‌-డిసెంబర్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తర్వాత కోవిడ్‌ పుంజుకోవడం ఇదే తొలిసారి. అదేవిధంగా 1.07 కోట్ల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించినట్లు వెల్లడించింది. గత వారం నుండి మహారాష్ట్రలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. శనివారం దేశంలో అత్యధిక కేసులు నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,112 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. కోవిడ్‌ ...

Read More »

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీకి క‌రోనా పాజిటివ్‌ అని తేలింది. శ‌నివారం అహ్మ‌దాబాద్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారస‌భ‌లో మాట్లాడుతూ… రూపానీ కళ్లు తిరిగి ప‌డిపోయారు. దీంతో అధికారులు  ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.   అయితే గ‌త కొన్ని రోజులుగా ఆయన అస్వ‌స్థ‌త‌తో వున్నట్లు చెప్ప‌డంతో వైద్యులు రూపానీకి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వహించారు. వాటితోపాటు కరోనా ప‌రీక్ష‌లు కూడా చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌ అని తేలింది.

Read More »

ఏడాదిలో కరోనా విజృంభణ ..దేశాలపై ప్రభావం

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమై నేటికి ఏడాదైంది. గతేడాది జనవరి 30న మొదటి కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పాటు మిలియన్ల కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పటికీ.. రోజుకి 12వేల నుండి 14 వేల వరకు కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గలేదని, కేసుల తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని.. ...

Read More »

దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు

 దేశంలో గడిచిన 24 గంటల్లో 11,666 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కరోనా నుంచి కోలుకొని 14,301 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో 123 మంది మరణించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకోగా.. 1,53,847 మంది మతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. 

Read More »

రాష్ట్రంలో 158 కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44,382 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 158 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. మరో 155 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 8,87,010కి చేరింది. వీరిలో ఇప్పటికే 8,78,387 మంది కోలుకున్నారు. ఇంకా 1476 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 24, విశాఖపట్నంలో 22, కృష్ణాలో 20 కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరంలో 2, కడపలో4, కర్నూల్లో 6 కేసులు ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు !

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో కరోనా టీకాలను పంపిణీ చేసిన దేశంగా భారత్‌ రికార్డుకెక్కింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకే రోజు వేసిన టీకాల సంఖ్య కంటే ఎక్కువగా భారత్‌ టీకాలను వేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్‌ అగ్నాని ప్రకటించారు. రెండో రోజు కూడా మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ కొనసాగిందని కేంద్రం తెలిపింది.

Read More »

బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

బ్రిటన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొత్త కరోనా వైరస్ వెలుగు చూడంతో లాక్‌డౌన్‌ విధించినా కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం దేశంలో 1,041 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌ నుండి చూస్తే ఇవే అత్యధిక మరణాలు. తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు యుకెలో 77, 346 మంది మృతి చెందారు. యూరప్‌లో బ్రిటన్‌లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 62,322 కొత్త కేసులు నమోదయ్యాయి.

Read More »