Tag Archives: corona

ప్రపంచ దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్న కరోనా

 పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు. జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 ...

Read More »

దేశంలో 10 వేలకు తగ్గిన కరోనా కేసులు

దేశంలో తాజాగా కరోనా కేసులు 10 వేలకు తగ్గాయి. రికవరీ రేటు కూడా 98.23 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం… దేశంలో కోవిడ్‌ కేసులు ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, 10,929 కొత్త కేసులు వెలుగుచూశాయి. 392 మరణాలు నమోదయ్యాయి. తగ్గిన రికవరీ రేటు.. క్రియాశీల రేటు..దేశవ్యాప్తంగా కోవిడ్‌ రికవరీ రేటు, క్రియాశీల ...

Read More »

చైనాలో పెరుగుతున్న కరోనా డెల్టా కేసులు

చైనాలో కొవిడ్‌ వైరస్‌ డెల్టా వెరియంట్‌ విజృంభిస్తోంది. ఈనెల 17వ తేదీ నుండి ఇప్పటి వరకు 11 ప్రావిన్స్‌లకు ఈ డెల్టా వెరియంట్‌ విస్తరించినట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఈ వేరియంట్‌ చైనాలోకి ప్రవేశించిందని చెప్పారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను విధించినట్లు తెలిపారు. గాన్సు ప్రొవిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిషేధించారు. శనివారం నాడు మొత్తం ఏడు ప్రావిన్సిలలో 26 కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. బీజింగ్‌లోనూ కేసులు ...

Read More »

కరోనా వైరస్‌ ఇప్పట్లో పోదు : డబ్ల్యుహెచ్‌ఒ

వైరస్‌ ఆధీనంలో మనం ఉన్నాం అని కానీ, వైరస్‌ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించవద్దని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆగేసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్‌ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న ...

Read More »

ఏపీలోమ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

ఏపీలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరిగాయి.  తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయ‌గా 1115 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది.  ఇందులో 19,85,566 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 19 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 13,857 మంది మృతి చెందారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనా నుంచి ...

Read More »

విశాఖలో విద్యార్థులపై కరోనా పంజా..

విశాఖలో పాఠశాల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. నగరంలోని గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్‌ చేయించారు. కాగా, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉండటం.. థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ...

Read More »

దేశంలో మళ్లీ కరోనా పంజా..

భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పెరిగిన కేసులతో దేశంలో ఆందోళన వ్యక్తమౌతుంది. ఒకపక్క కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల టెన్షన్‌ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 16,40,287 మంది నమూనాలను పరీక్షించగా.. 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిన్నటి కంటే దాదాపు 4 శాతం ఎక్కువ. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,18,56,757కు చేరుకుంది. ఇదే సమయంలో ...

Read More »

మూడో దశలో పిల్లపై తీవ్ర ప్రభావం

కోవిడ్‌ మొదటి దశ కంటే రెండో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇక మూడో దశలో.. మరింత ఎక్కువగా ప్రభావం చూపనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్స్‌ విభాగం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై దాదాపు సంవత్సరం నుంచే ఆ ప్రభావం పడిందని, థర్డ్‌వేవ్‌ వస్తే… ఈ పిల్లలపై మళ్లీ వైరస్‌ ప్రభావం చూపనుందన్న ఊహాగానాలు ...

Read More »

ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 41,806 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 581 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,11,989 ...

Read More »

4 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న  దేశవ్యాప్తంగా 46 వేల 617 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే 4.4 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 4 లక్షల 58 వేల 251కి పెరిగింది. ఇక ఇప్పటివరకూ 2 కోట్ల 95 లక్షల 48 వేల 302 మంది కరోనా ...

Read More »