Tag Archives: delhi

ఢిల్లీకి చేరుకున్నCM రేవంత్.. MP టికెట్ ఆశవహుల్లో తీవ్ర ఉత్కంఠ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీఈసీ మీటింగ్‌లో రేవంత్, భట్టి, ఉత్తమ్ పాల్గొననున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై ...

Read More »

కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా ఆప్ నిర‌స‌న‌లు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట‌యి ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ అరెస్టు అక్ర‌మం అంటూ ఆప్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌వారం ఢిల్లీ వ్యాప్తంగా నిర‌స‌న‌కు దిగారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేజ్రీవాల్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాషాయ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా చేప‌ట్టాయి.

Read More »

నేడు ఢిల్లీకిCM రేవంత్.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై సస్పెన్స్ వీడనుందా..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. సెకండ్ లిస్ట్‌పై హై కమాండ్‌తో రేవంత్ చర్చించనున్నారు. ఇక తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇక, 13 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ...

Read More »

ఢిల్లీలో ప్రధాని మోడీపై వైఎస్ షర్మిల ఫైర్…

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆమె ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామన్న హామీని ప్రధాని మోదీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. పదేళ్లు కాదు కదా… ఒక్క ఏడాది కూడా ప్రత్యేక హోదాను ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ...

Read More »

25 మంది ఎంపిల‌కు కరోనా..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొదటిరోజున నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మంది స‌భ్యు‌ల‌కు పాజిటివ్‌గా నిర్థారణైంది. మీనాక్షిలేఖి, అనంత్‌కుమార్‌ హెగ్డే, పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, పార్లమెంటు సమావేశం మొదటిరోజున సుమారు 200 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. సందర్శకుల గ్యాలరీలో మరో 30 మంది ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Read More »

తాజ్‌మహాల్‌ పున:ప్రారంభం వాయిదా

కరోనా వైరస్‌ కారణంగా మార్చి 19వ తేదీ నుంచి మూతపడ్డ తాజ్‌మహాల్‌ తిరిగి ఈరోజు తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు జరగలేదు. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆగ్రాలో కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో కేసుల సంఖ్య పెరిగి పర్యాటకలు ఇబ్బందులు పడతారనే కారణంతో తాజ్‌మహాల్‌ పున: ప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

Read More »

ఢిల్లీలో భారీ సడలింపులు

లాక్‌డౌన్‌ 4.0 అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ సడలింపులు ప్రకటించారు. 20 మంది ప్రయాణీకులతో బస్‌లను అనుమతిస్తామని, ఇద్దరు ప్రయాణీకులతో కార్లను, ఒక ప్రయాణీకుడితో ఆటోలు, ఈ రిక్షాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. సరి-బేసి పద్ధతిలో అన్ని షాపులు తెరుచుకుంటాయని, అన్ని కార్యాలయాలను అనుమతిస్తామని వెల్లడించారు.ప్రతి ప్రయాణం ముగిసిన తర్వాత వాహనాలను డ్రైవర్లు పరిశుభ్రం చేయాలని చెప్పారు. ఇక సెలూన్‌, బార్బర్‌ షాపుల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. రెస్టారెంట్లను కేవలం హోం డెలివరీ కోసమే అనుమతిస్తామని తెలిపారు. అయితే మెట్రోలు, మాల్సా్‌, ...

Read More »

ఢిల్లీ లో భూ ప్రకంపనలు

ఢిల్లీ లో భూ ప్రకంపనలు

దేశ రాజధాని ప్రాంతంలో ఆదివారం భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తూర్పు ఢిల్లీ కేంద్రంగా సాయంత్రం 5.45 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై భూ ప్రకంపనలు 3.5గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More »