Tag Archives: disha

కట్టుదిట్టంగా ‘దిశ’

‘దిశ’ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ క్రిమినల్‌ లా సవరణ బిల్లుకు త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ప్రత్యేకకోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు. దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు

Read More »

దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుంది: హోంమంత్రి సుచరిత

దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుంది

ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత పర్యటించారు. బుడంపాటు, ఏటకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. దిశ మొబైల్‌ యాప్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని బాధితులు అభినందిస్తున్నారన్నారు. దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుందన్నారు. అయితే మంగళగిరి గ్యాంగ్‌రేప్‌పై మాత్రం సుచరిత నోరు మెదపలేదు. దీంతో సొంత జిల్లాలో గ్యాంగ్‌రేప్‌ జరిగితే స్పందించలేదంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More »

‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్

‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది

దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పీఎస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దిశ’ కార్యశాలలో సీఎం పాల్గొని మాట్లాడారు. . రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేరస్థులతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ‘దిశ’ చట్టం దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే తమ తొలి ప్రాధాన్య అంశమన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ...

Read More »

‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని దిశ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.

Read More »