Tag Archives: Eamcet 2020

ఎపిలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 23 నుంచి 25 వరకు మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 2,72,900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ ధరించిన విద్యార్థలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ...

Read More »

తెలంగాణలో కొనసాగుతున్న ఎంసెట్

 తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో తొలిరోజు ఒక్క సెంటర్‌లోనే పరీక్ష జరగనుందని, రేపటి నుండి ఎనిమిది సెంటర్‌లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,43,165 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణలో 79, ఎపిలో 23 చొప్పున మొత్తం 20 టెస్ట్‌ జోన్‌లలో 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,10,11,14 తేదీలలో ప్రతి రోజు రెండు విడతల చొప్పున మొత్తం ఎనిమిది విడతల్లో ఈ పరీక్ష ...

Read More »