Tag Archives: high court

అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వరణకాంత శర్మ వాదనలు విన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారాన్ని ...

Read More »

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో షాక్

తనకు 4+4 గన్‌మెన్‌లను కేటాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రతి ఒక్కరికీ ఇలా కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్‌లను కేటాయించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం… శ్రీనివాస్ గౌడ్‌కు గన్‌మెన్లు అవసరమా? కాదా? తెలపాలని డీజీపీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ ఆదేశాలు

ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. ...

Read More »

టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో కొనసాగుతున్న ఉత్కంఠ

లాక్‌‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలపగా, సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ అయితే రెగ్యులర్‌ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ...

Read More »

పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నివేదికను హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వాకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు.కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు ...

Read More »

తెలంగాణ లో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ ...

Read More »

హైకోర్టు ని ఆశ్రయించిన రేవంత్ రెడ్డి సోదరులు

హైకోర్టు ని ఆశ్రయించిన రేవంత్ రెడ్డి సోదరులు

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్‌ సోదరుల పిటిషన్‌పై విచారణ ...

Read More »