Tag Archives: independence day

 ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’

ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్‌​ వాసులు ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా అతి పెద్ద జాతీయ జెండాలా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.దాదాపు 5 వేల మందికి పైగా అతిపెద్ద మానవహారంలా ఏర్పడి జాతీయ జెండాను రెపరెపలాడించి సరికొత్త రికార్డును సృష్టించారు. ‘హర్ ఘర్ తిరంగ’ ...

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.’ ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!’ అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు.

Read More »

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన ...

Read More »