Tag Archives: jagan review meeting

ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష

ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష

జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. ‘‘నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి. నూటికి నూరు శాతం కచ్చితంగా ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్న ...

Read More »

సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్‌ సమీక్ష

ఆలస్యం లేకుండా సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో భూముల రీ సర్వేపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు ...

Read More »

కరోనా నివారణపై చర్యలపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్

కరోనా నివారణపై చర్యలపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్

అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆమేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. క‌రోనా వైర‌స్‌పై సీఎం జ‌గ‌న్‌ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ ‌రాష్ట్రంలో కోవిడ్‌‌ పరిస్థితులను వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వలస‌ కార్మికులు, అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల అంశాలపై సీనియర్‌ అధికారి కృష్ణబాబు వివరాలు ...

Read More »

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా వైరస్‌ సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఘటన అమానవీయమని.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం ...

Read More »

కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ, పరీక్షల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి.. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 809 పరీక్షలతో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు వివరించారు.

Read More »

నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

ఏపీలో రొయ్య రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చేపలు, రొయ్యల కొనుగోళ్ల నిలిపివేయడంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరులో 11 ప్రాసెసింగ్‌ యూనిట్లు నిలిపివేతకు గురయ్యాయి. నేడు ఆక్వా రంగంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read More »

అంబేడ్కర్‌ జయంతి రోజున ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు.ఉగాది రోజున ఇళ్లపట్టాలను ...

Read More »

పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్ష

పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్ష

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనులను సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులపై సమీక్ష చేపట్టారు. పులివెందుల మెడికల్‌ కాలేజ్‌ పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టగా.. పనులకు సన్నద్ధవవుతున్నామని అధికారులు ఆయనకు ...

Read More »

రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్‌

రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన జగన్‌

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్‌ చేసుకునే వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్‌, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి సీఎం జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు

Read More »