Tag Archives: jagan

వైసిపిలో ఎమ్మెల్యేలుగా ఓడిన వారందరికీ నామినేటెడ్‌ పదవులు

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. 2019లో జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీచేసి ఓడినవారికి ఈ నామినేషన్‌ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఓటమి పాలైన 24మందికి నామినేటెడ్‌ పదవులు వరించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల అనంతరం ఈ 24మందిలో కొంతమందిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓడినవారికా, లేక ప్రస్తుతం పార్టీ సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్న వారికా అన్న విషయం తేలాల్సి వుంది. ...

Read More »

జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌ను ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే సోమవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనిల్‌ కుంబ్లే.. ఏపీ సీఎంతో భేటీ కావడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టాడు. టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మొదటి స్థానం, ప్రపంచ దేశాల బౌలర్లలో 3వ ...

Read More »

మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..జగన్

ఏదైనా సమస్యతో ఫిర్యాదులివ్వాలన్నా.. కేసులు పెట్టాలన్నా మహిళలు పోలీసుస్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఫిర్యాదులు చేయొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. దిశ యాప్‌లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం కావాలని, ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపైనా సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని సూచించారు.

Read More »

కత్తి మహేష్ చికిత్సకు జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం మొదట నెల్లూరు ఆస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఎపి ప్రభుత్వం ఆర్థికసాయం ...

Read More »

తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నా..జగన్

 తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడట్లేదన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎలా ఊరుకోవాలి. నీటి విషయంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలంటూ మంత్రులకు సూచించారుర. విద్యుత్ విషయంలో మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కోరారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాల ...

Read More »

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: జగన్

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్‌ అని సిఎం జగన్‌ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్‌ రూపొందించామని, ఇప్పటికే దిశ ...

Read More »

9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్‌ కేసులు

కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడిన 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై ఎపి సర్కార్‌ క్రిమినల్‌ కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… అవకతవకలకు పాల్పడిన తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ...

Read More »

జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన జగన్‌

2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామన్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని సిఎం ...

Read More »

నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో పోలవరంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Read More »

ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌

రాష్ట్రంలో పేద‌ల కోసం ప్ర‌భుత్వం ఇళ్ల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇళ్ల నిర్మాణం కోసం ఇప్ప‌టికే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను పంపిణీ చేసింది.  ప్ర‌భుత్వం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్ర‌భుత్వ‌మే ప‌క్కాగా ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చేందుకు సిద్ద‌మైన విష‌యం తెలిసిందే.  ఇటీవ‌లే దీనికి సంబందించిన కార్య‌క్ర‌మం అధికారికంగా ప్రారంభించారు.  ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు.  ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌ను ఆ లేఖ‌లో వివ‌రించారు.  ఏపీలో 30ల‌క్ష‌ల మందికి ...

Read More »