Tag Archives: jagan

డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి గడపకు ...

Read More »

ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్‌ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్‌ వారికి పలు సూచనలు చేశారు. రేపు ...

Read More »

పెన్మత్స సురేష్‌బాబుకు బీఫాం అందజేత

ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారైన పెన్మత్స సురేష్‌బాబుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాం అందజేశారు. సురేష్‌బాబు వెంట మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, దివంగ‌త పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుమారుడు సురేష్‌బాబును అభ్య‌ర్థిగా దించారు.

Read More »

రాయలసీమ ఎత్తిపోతల గురించి షెకావత్‌కు జగన్‌ లేఖ

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్‌ రాసిన లేఖకు జగన్‌ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్‌ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. ...

Read More »

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు.సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను ...

Read More »

సాంబశివరాజు మృతికి సీఎం జగన్‌ సంతాపం

రాజకీయ కురువృద్ధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More »

సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Read More »

కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు: సీఎం జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం అదనంగా 2380 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ...

Read More »

మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం

నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు.కాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవడంతో వారిరువురు ...

Read More »

ఏపీ సీఎం సహాయనిధికి విరాళం

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నవ్యాంధ్రప్రదేశ్‌ తరపున 1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. 285 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అసోసియేషన్‌ ప్రతినిథులు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కె మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ త్రినాథ్ తదితరులు ఉన్నారు.

Read More »